ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయం దౌర్భాగ్యం : పోకల
గరిడేపల్లి, జూన్ 23 : రేషనలైజేషన్ పేరుతో రేవంత్ సర్కార్ మన రాష్ట్రంలోని 23 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయం దౌర్భాగ్యకరమని భాజపా సూర్యపేట జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు ఆగ్రహించారు. మంగళవారం ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ పిలుపుమేరకు మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను ఏబీవీపీ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బంద్ చేయించారు.
ఈ సందర్భంగా పొనుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాల, సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ పేద కుటుంబ విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసేందుకు ప్రభుత్వo కంకణం కట్టుకుందని, ఇలాంటి దుశ్యర్యను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో విద్యార్థి పరిషత్, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి తగు గుణపాఠం చెబుతామన్నారు. ఈ కా ర్యక్రమంలో రవి, ముఖేష్, గోపి, సతీష్, భాజపా నాయకులు మలికంటి శ్రీనివాస్, చామకూ రి వెంకటేశ్వర్లు, షేక్ మీరా, లక్షాధి, మండవ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.






