రాజన్న ఆలయాభివృద్ధిని వేగవంతం చేయాలి
- విజయక్రాంతి దినపత్రిక డైరెక్టర్, ఆలయ మాజీ ధర్మకర్త విజయరాజం
- భీమేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు
వేములవాడ, జూలై 5 (విజయక్రాంతి): రాజన్న ఆలయ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావాలని విజయక్రాంతి దినపత్రిక డైరెక్టర్, ఆలయ మాజీ ధర్మకర్త విజయరాజం ఆకాంక్షించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని విజయరాజం ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం ఆశీర్వచ న మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో రమాదే వి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా విజయరాజం మాట్లాడుతూ.. శ్రీ భీమేశ్వర స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, వేములవాడ క్షేత్ర మహిమ మరింత విస్తరించి భక్తుల రాక రోజురోజుకూ పెరగాలని ప్రార్థించినట్టు తెలిపారు.






