25 April, 2026 | 3:25 AM

అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

25-04-2026 01:37 AM

జగిత్యాల, ఏప్రిల్ 24 ( విజయక్రాంతి ) :శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశం మందిరం లో నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్ష  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన డిస్ట్రిక్ట్ మీడియా అక్రిడిటే షన్ కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్  మాట్లాడుతూఅర్హులైన వారికి  అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, 252 జి ఓ  ననుసరించి నియమ నిబంధనలు పాటించాలని అన్నారు.మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సరిగ్గా చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తారని  కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థ పై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు.అక్రిడిటేషన్  ప్రక్రియ సజావుగా జరిగే విధంగా చూడాలని నియమ నిబంధనలు పాటించాలని, ఎప్పటికప్పుడు కమిటీ సభ్యులతో అన్ని విషయాలు చర్చించి ముందుకు వెళ్లాలని సూచించారు.

ఎవరైనా అక్రిడిటేషన్ కోసం నకిలీ  ధ్రువపత్రాలు సమర్పించినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అంతకుముందు కమిటీ సభ్యులు చీటీ శ్రీనివాసరావు, పిఎస్ రంగారావు అక్రిడియేషన్ ప్రక్రియ గురించి తమ అనుభవాలను పంచుకొని, ఈ ప్రక్రియ సజావుగా మరియు పారదర్శకంగా సాగే విధంగా పలు సూచనలు చేశారు. అనంతరం కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ ను శాలువా కప్పి పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు.ఈ సమావేశం లో డి పి ఆర్ ఓ. నరేష్, ౄMAC కమిటీ సభ్యులు చీటీ శ్రీనివాసరావు, గంగుల రామ్ గోపాల్, ద్యావర సంజీవరాజు,  పి.ఎస్. రంగారావు,  అబ్దుల్ ముజాహిద్ ఆదిల్, కర్నే సంతోష్, బి.సదాశివకుమార్ దొమ్మటి అంజు గౌడ్, వి. ప్రవీణ్ కుమార్,ఎస్ వేణుగోపాల్ కల్పన,విష్ణు, డిపిఆర్‌ఓ,ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.