15 May, 2026 | 3:01 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

15-05-2026 01:38 AM

హనుమకొండ, మే 14(విజయ క్రాంతి): అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అమలు విధి విధానాలపై కమిషనర్ ఫర్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డా. టి.కే. శ్రీదేవి గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహాత్ బాజ్పాయ్ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీడీఎంఏతో పాటు జిల్లా కలెక్టర్ నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన నిధులు, అమలు విధానాలు, సంబంధిత నియమ నిబంధనలు, సమగ్ర డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నగరానికి సుమారు రూ. 5,270 కోట్లు మంజూరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. 

ఈ నిధులతో నగర మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ఊతం లభించనున్నట్లు పేర్కొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఇంచార్జి ఎస్‌ఈ శ్రీనివాస్ రావు, ఈఈలు రవి కుమార్, సంతోష్ బాబు, మహేందర్, మాధవీలత, కేడబ్ల్యూఎఫ్ ప్రతినిధి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.