16 April, 2026 | 8:16 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పేదల సంక్షేమానికి పెద్దపీట

14-06-2025 10:34 PM

ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(MLA Dr. Jatoth Ramachandru Naik) అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు తొలి విడత ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఇండ్లు నిర్మించి ఇస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇండ్లు ఇస్తామని చెప్పారు.