16 April, 2026 | 12:18 AM

పేదల సొంతింటి కల సాకారం

10-11-2025 12:11 AM

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి

 జడ్చర్ల,నవంబర్ 9: తాండల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. బాలానగర్ మండలంలోని జీడిగుట్ట తండా గ్రామపం చాయతీ పరిధిలోని పంచాంగుల గడ్డ తాండ లో రాష్ర్ట ప్రభుత్వ సహకారంతో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును జడ్చర్ల శాసనసభ్యులు  జనంపల్లి అనిరుద్ రెడ్డి  ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. 

ఇల్లు లేని కుటుంబాలకు తలదాచుకునే సొంత గృహం కల్పించడం మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిజంగా అవసరమైన వారికి ఇల్లు చేరేలా పారదర్శక విధానంలో ఇళ్లు నిర్మించి అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, తండాల పురోగతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి గ్రామం, ప్రతి తండా అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు నిధులు కేటాయించి పనులు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.  ప్రజల మద్దతుతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.