10-11-2025 12:10:18 AM
-పోర్టబిలిటీ ఉంది కదా.. ఇబ్బంది ఏముంది!
-పేరు ఒకరిది.. రేషన్ షాప్ నిర్వహణ మరొకరిది
-అంతా ఓ ‘లెక్క’ ప్రకారం నడుస్తున్న పలు రేషన్ షాపులు
-తనిఖీలు అంతంతే.. అన్నిటికీ ఆన్‌లైన్ పేరు
-నిబంధనల ప్రకారం షాప్ నిర్వహణ ఉండాలి : మధుసూదన్ నాయక్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్
మహబూబ్‌నగర్, నవంబర్ 9 (విజయక్రాంతి): రేషన్ షాపుల నిర్వహణ ఇష్టంనుసారంగా మారింది. పేరు ఒకరిది ఆ షాపు నిర్వహణ మరొకరిది అంతా ఒక లెక్క ప్రకారం నడుస్తున్నాయి. నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం ఆమడ దూరం ఉండడంతో రేషన్ షాపుల నిర్వహణ ఆడింది ఆట పాడింది పాటగా మారాయి. రేషన్ షాపుల నిర్మాణ నిమిత్తం ప్రత్యేక శాఖ సంబంధిత అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచినప్ప టికీ తనిఖీలు చేపట్టడంలో మాత్రం సంబంధిత అధికార యంత్రాంగం ఆశించిన మేర కు అడుగులు వేయడం లేదని తెలుస్తుంది.
ఏ రేషన్ షాపు ఎప్పుడు తెలుస్తారో? ఎప్పు డు మూస్తారు ఆ రేషన్ షాపు నిర్వాహకులకు మాత్రమే తెలిసే పరిస్థితి నెలకొం టుంది. పోర్టబిలిటీ ఉండడంతో ఏ షాపులో రేషన్ కార్డు ఉన్న మరొక షాపులో తీసుకున్నందుకు అవకాశం ఉండడంతో కొందరు రేషన్ షాప్ నిర్వాహకులు వారి ఇష్టానుసారంగా తెలుస్తూ మోస్తూ ఉన్నారు. ఉండ డంతో నిరంతరం నిఘా ఉంచితేనే నిజమైన లబ్ధిదారులకు సరైన సమయంలో రేషన్ అంది అవకాశాలు ఉంటాయని లబ్ధిదారులు చెబుతున్న మాట.
జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులు ఇలా..
జిల్లావ్యాప్తంగా 506 రేషన్ షాప్ లో ఉన్నాయి. ఇటీవల అందించిన నూతన కార్డులతో కలిపి మొత్తం 271760 కార్డులో ఉన్నాయి. ఈ కార్డుల పరిధిలో 927489 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెల రేషన్ షాపుల దగ్గరికి వెళ్లి తంబు పెట్టి లబ్ధిదారులు రేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా రేషన్ షాపుల నిర్వహణ మాత్రం ఇష్టం సారంగా జరుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. కొన్ని రేషన్ షాపులలో తంబు పెట్టించుకుని బియ్యం అవసరం లేదంటే మేమే తీసుకుంటామని కిలోకు పది రూపాయలు చొప్పున అందిస్తామని చెప్పడం విశేషం. మరి ఆ రేషన్లోనే నేరుగా లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన ఆ బియ్యం ఎటుపోతున్నాయని ప్రశ్న ఉ పందుకుంటుంది. అధికారుల సైతం రేషన్ షాపుల నిర్వహణపై అంతంత మాత్రమే పర్యవేక్షణ చేయడంతో కొందరు రేషన్ షాపుల నిర్వాహకులు ఆడింది ఆట పాడింది పాటగా మారింది.
షాపు ఒకరిది..నిర్వాణ మరొకరిది..
మీకు రేషన్ షాపు ఉంటే చాలు... ఆ షాపు నిర్వహణ మొత్తం మేము చూసుకుంటాం మీకు నెలకు ఇంత ఇస్తాం. అనే ఒప్పందాలు జిల్లా వ్యాప్తంగా పలు రేషన్ షాపులకు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని రేషన్ షాపుల నిర్వాహకులు వారు చేయకపోగా ఇతరులకు అప్పజెప్పి వారు ఇచ్చిన కాడికి తీసుకొని నిర్వాహకులకు మద్దతు పలుకుతుండ్రు. నియంత్రించా ల్సిన అధికార యంత్రాంగం అటువైపు చూడడమే మానేశారు.
ఏమిటని అడిగితే అంత తంబు సిస్టం వేలు పెడితేనే బియ్యం వస్తాయి అవినీతి ఎక్కడ జరుగుతుంది అంటూ కొందరు అధికారులు కాలయాపన చేస్తుండ్రు. సమయపాలన వారి ఇష్టం సారంగా నిర్వహిస్తూ ప్రభుత్వం చెప్పిన సమయం అసలు ఎక్కువ శాతం రేషన్ షాపుల నిర్వాహకులు పాటించడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రం అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్న మాట.
ఆ రేషన్ షాప్ నోటీస్ ఇవ్వండి... మధుసూదన్ నాయక్, రెవిన్యూ అదనపు కలెక్టర్, మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కేంద్రంలోని పలు రేషన్ 12, 19, 21, 34, 42 షాపులను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదివారం తనిఖీ చేశారు. షాప్ నెంబర్ 34 నిర్వహణ ఆ షాపు యజమాని చేయడం లేదని ఇతరులకు అప్పగించినట్లు అదనపు కలెక్టర్ గుర్తించారు. వెంటనే రేషన్ షాప్ డీలర్ కు షోకేస్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. ఉదయం సాయంత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా రేషన్ దుకాణాల తెరవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.