10-11-2025 12:13:02 AM
నారాయణపేట, నవంబర్ 9 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా కేంద్ర సమీపంలోని పగడి మారి రోడ్డు లో గల శ్రీ శ్రీ శ్రీ సద్గురు రూపరహిత అహింసా యోగేశ్వరి వీరధర్మజ మాతా మాణికేశ్వరి ఏడవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు ధ్వజారోహణము, 7 గంటలకు గోమాత పూజ, 8 గంటలకు నాగ సింహా సన అభిషేకము, 9 గంటలకు అమ్మవారి పాదుకల అభిషేక పూజలు, మహా గాయత్రి యజ్ఞము, 12 గంటలకు మంగళహారతి, మహిళలచే ఓంకారం త్రిశూలాకార కార్తీక దీపాలంకరణోత్సవము, ఒంటిగంటకు తీర్థ ప్రసాద అన్న దాన కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట్ల మధుసూదన్ రెడ్డి, మాధవరెడ్డి లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నారాయణపేట మాత మాణికేశ్వరి ఆశ్రమ కమిటీ సభ్యులు ఏవి మందార,ఏవి లత, బండి శివరాం రెడ్డి, బండి రాజేశ్వరి, వాల్వేకర్ నికేతన్, దశరథ్, విటల్ బిలాల్, తమ్మలి సత్యనారా యణ, కొండల శ్రీనివాస్, భూపాల్ రెడ్డి, సుజాత, వాసవిలతోపాటు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.