04-02-2026 01:01:37 AM
బెజ్జూర్, ఫిబ్రవరి ౩ (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని మత్తడి స్వింగానకట్ట సమీపంలో ఎల్లారం పోచమ్మ అమ్మవారి జాతర, బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు జిల్లాల సుధాకర్ గౌడ్ తెలిపారు. అడవిలో వెలసిన అతి పురాతనమైన ఎల్లారం పోచమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు రెండోసారి ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఈనెల 4 వ తేదీ, అఖండ జ్యోతి ప్రజ్వలన ఉదయం 9 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం లోని ఇందిరానగర్ మహంకాళి దేవాలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్ స్వామి, సత్యనారాయణ శాస్త్రి, దీకొండ అశోక్ చారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 5వ తేదీన ఉదయం 11 గంటలకు అమ్మవారికి బోనాల సమర్పణ, అనంతరం అమ్మవారి కి మొక్కల చెల్లింపు కార్యక్రమాలు ఉంటుందని ఆలయ కమిటీ అధ్యక్షులు జిల్లాల సుధాకర్ గౌడ్ తెలిపారు.