18 May, 2026 | 2:33 AM

రెసోనెన్స్ విద్యార్థుల అద్భుత ప్రతిభ

18-05-2026 01:32 AM

ఎప్‌సెట్‌లో ఉత్తమ ఫలితాలు

ఇంజినీరింగ్ విభాగంలో రుషికి మొదటి ర్యాంకు

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): రెసోనెన్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఎప్‌సెట్2026లో అద్భుత ఫలితాలు సా ధించారు. ఇంజినీరింగ్ విభాగంలో ఎం రుషి రాష్ట్ర మొదటి ర్యాంక్, వెటర్నరీ, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో అటిపాముల భా ర్గవ రాష్ట్ర 41వ ర్యాంక్ సాధించారు. మాదాపూర్ సిద్ధి వినాయక నగర్‌లో ఉన్న నాగ్-శేష్ కన్వెన్షన్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించారు.

రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావు నర్రా మాట్లాడుతూ.. ఈ పరీక్షలో విద్యార్థులు సా ధించిన అద్భుత ఫలితాలతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఫలితాలు విద్యా ర్థుల కృషి, అధ్యాపకుల నిరంతర శ్రమ, తల్లిదండ్రులు మాపై ఉంచిన నమ్మకానికి నిదర్శ నమన్నారు. తెలంగాణలోని అగ్రశ్రేణి 10 ఈఏపీసీఈటీ కళాశాలల్లో మెరిట్ సీట్లకు 1250 పైగా విద్యార్థులు అర్హత సాధించారు. అగ్రశ్రేణి 30 ఈఏపీసీఈటీ కళాశాలల్లో మె రిట్ సీట్లకు 3250 పైగా విద్యార్థులు అర్హత సాధించారు. వెటర్నరీ, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలలో, తెలంగాణలోని అగ్రశ్రేణి 10 ఈఏపీసీఈటీ కళాశాలల్లో మెరిట్ సీట్లకు 250 పైగా విద్యార్థులు అర్హత సాధించారు.