15 March, 2026 | 8:14 AM

వనదేవతల జాతరను ఘనంగా నిర్వహించాలి

15-01-2026 01:07 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

మణుగూరు, జనవరి14 (విజయ క్రాంతి): తొగ్గూడెం గ్రామంలోని  సమ్మక్క సారల మ్మ జాతరలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పాయం వెంక టేశ్వర్లు స్పష్టం చేశారు. అమ్మవారు వన ప్రాంతం నుండి ఆలయానికి చేరుకొనే మార్గాన్ని బుధవారం ఆయన స్వయంగా అడవి మార్గంలో వెళ్లి పర్యవేక్షించారు.అనంతరం జాతరల ఏర్పాట్లు, తీసుకో వాల్సిన చర్యలపై జాతర కమిటీ సభ్యు లు , సర్పంచులను జాతరలో చేయాల్సిన ఏర్పాట్లను, చర్యలను అడిగి తెలుసుకు న్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా మినీ మేడారం జాతర ఏర్పాట్లు కొనసాగాలని అధికారులకు సూచించా రు.

జాతర నిర్వహణలో ఎక్కడైనా లోటు పాట్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతర కావ డంతో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాల న్నా రు. ప్రత్యేకంగా శానిటేషన్, త్రాగునీరు, రహదారులు, విద్యుత్ సరఫరా వంటి మౌలికసదుపాయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, వివిధ శాఖల అధికా రులు పరస్పర సమన్వయంతో పనిచేసి జాతరను అత్యంత వైభవంగా నిర్వహిం చాలని తెలిపారు.ఆలయ చైర్మన్‌ఊకె వీరయ్య, పూజారి పర్షిక రాజమ్మ, మడకంకృష్ణ, ఉప సర్పంచ్ మహేష్, ఫారెస్ట్ అధికారి ముజాయిద్దీన్, శివాల యం చైర్మన్ కూచి పూడి బాబు, మనో జ్,శ్వేతన్, అధికారులు పాల్గొన్నారు.