భాగ్యనగర్ తండాలో ఘనంగా ముగ్గుల పోటీ
కారేపల్లి జనవరి 14(విజయక్రాంతి): భాగ్యనగర్ తండాలో సంక్రాంతి పండగ సందర్భంగా భోగిని పురస్కరించుకొని గ్రామ మహిళలకు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని సర్పంచ్ హీరాలాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్ రిబ్బన్ కటింగ్ చేసి ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు తమ ప్రతిభలను ముగ్గుల రూపంలో అద్భుతంగా గీయడంతో ప్రజలు చూస్తూ మంత్రముగ్ధులయ్యారు.
అనంతరం ముగ్గుల పోటీ విజేతలను నిర్ణయించడానికి భాగ్యనగర్ తండా పంచాయతీ కార్యదర్శి పెండ్రా అనిల్ , సింగరేణి సర్పంచ్ మేదరి వీర ప్రతాప్ టోనీ, ఉసిరికాయల పల్లి సర్పంచ్ గుగులోత్ వరలక్ష్మీ రాజు,కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, మండల నాయకులు రామ్మూర్తి నాయక్ లు పాల్గొని విజేతలకు ఒకటి నుంచి ఐదు వరకు బహుమతులను ప్రదానం చేశారు .ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ తండా వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.




