29 May, 2026 | 2:56 AM

వడదెబ్బతో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలి

29-05-2026 12:00 AM

4 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని న్యూడెమోక్రసీ డిమాండ్

చర్ల: మే 28 (విజయక్రాంతి): తీవ్ర ఎండలతో వడదెబ్బకు గురై మృతిచెందిన కొమ్మినేని శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్ చేశారు.

40 ఏళ్లుగా ఊరూరు తిరిగి చిత్తుకాగితాలు ఏరుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఇద్దరు కుమారులను చదివిస్తున్న శ్రీనివాసరావు, బుధవారం  ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి మరణించారని తెలిపారు. కుటుంబ పెద్ద మరణంతో భార్య, ఇద్దరు కుమారులు దిక్కులేనివారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 4 లక్షల ఎక్స్గ్రేషియా, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. పిల్లల చదువులకు దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు