మొండికుంటలో నూతన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం
అశ్వాపురం మే 28 (విజయక్రాంతి): మండల పరిధిలోని మొండికుంట గ్రామంలో మాజీ ఎంపీటీసీ కమటం నరేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర క్వాలిటీ ఫ్యూయల్స్ భారత్ పెట్రోలియం బంకును పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఇంధన సేవలు అందుబాటులోకి రావడం ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వాణిజ్య సంస్థలు ఏర్పడడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మొండికుంట సర్పంచ్ మర్రి సంధ్య, ఓరుగంటి రమేష్ బాబు, గాదె కేశవరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పర్వత నరేష్, ఊస అనిల్, మల్లెలమడుగు సర్పంచ్ మచ్చా నరసింహారావు, ఆవుల రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీ బారాజు సంపత్, బేతం రామకృష్ణ, సామకూరి వెంకన్న, బచ్చు వెంకటరమణ, బురెడ్డి, తుక్కాని మధు, సర్వకృష్ణ, చుంచు ఏకాంబరం, గ్రామ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






