4 June, 2026 | 1:19 AM

పెంచడం.. నరకడం..

04-06-2026 12:30 AM

పచ్చని చెట్ల పై కాటు.. 

ఇదే అన్నావాయితిగా పచ్చని చెట్ల నరికివేత...

తాడ్వాయి, జూన్, 3 (విజయక్రాంతి): ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి మొక్కలు పెంచుతున్నారు. పెంచిన మొక్కలను అడ్డంకిగా మారుతున్నాయని నరికి వేస్తున్నారు. పెంచడం నరకడం ఇదే అనవాయితిగా కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా గత ప్రభుత్వ హాయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మొక్కలు నాటడం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు.

మొక్కలు ఎంత ఏపుగా పెరిగితే అంత పచ్చదనం ఉంటుందని పర్యావరణం బాగుంటుందని ప్రభుత్వం భావించి ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. కానీ ఈ మొక్కలే అడ్డంకిగా మారుతున్నాయని వాటినే అడ్డంగా నరికి వేస్తున్నారు. డబ్బులు ఖర్చు చేయడమేమిటి, మొక్కలు నాటడం ఏమిటి,వాటిని తిరిగి నరికి వేయడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క కృష్ణాజివాడి గ్రామంలోనే కాకుండా మండలంలోని గ్రామాల్లో సైతం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొక్కలు నరకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.