calender_icon.png 16 February, 2026 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రథమ పౌరుడు ఎవరో తేలేది నేడే

16-02-2026 12:00:00 AM

  1. కరీంనగర్, జగిత్యాలపైనే అందరి దృష్టి

ఉత్కంఠ రేపుతున్న క్యాంపు రాజకీయాలు

కరీంనగర్, ఫిబ్రవరి 15 (విజయ క్రాంతి): కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థ మేయర్ల, డిప్యూటీ మేయర్ల ఎన్నిక, ఉమ్మడి జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట, చొ ప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్, మంథని, పెద్దపల్లి, సుల్తానా బాద్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్మ న్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక సోమవారం ఆయా మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ఓటింగ్ పద్ధతి ద్వారా జరగనుంది. ఉమ్మడి జిల్లాలోని 10 మున్సిపాలి టీల్లో కాంగ్రెస్ వారే ప్రథమ పౌరుని పీఠం ఎక్కనుండగా, మూడింటిలో ఉత్కంఠ నెలకొంది.

అందులో కరీంనగర్ నగరపాలక సంస్థ పైనే అందరి దృష్టి ఉంది. గంట గంట కు సమీకరణలు మారుతుండడంతో మేయ ర్ పీఠం బీజేపీకా, కాంగ్రెస్ కా అన్న ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉండగా 30 డివిజన్లు బీజేపీ గెలిచింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజే పీ తరపున ఎక్స్ అఫిషియో సభ్యునిగా, మా జీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్‌ఎస్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా, మాన కొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయ ణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఉన్నారు.

మొత్తం వీరితో కలిపి 69 అవుతుండగా 35 సభ్యుల బలం ఉంటే ఆ పార్టీకి మేయర్ పీఠం దక్కుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 14 మంది గెలుపొందగా, బీఆర్‌ఎస్ నుంచి 9 మంది, ఎంఐఎం నుంచి ముగ్గురు గెలుపొందారు. ఈ మూడు పార్టీల బలం 26 అవుతుండగా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఇద్దరు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఇద్దరు ఉన్నారు. వీరితో కలుపుకొని 30 అ వుతుండగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్ధులు అవసరం ఉంటుంది. బీజేపీ ఎక్స్ అఫిషియ్ సభ్యునితో కలిపి 31 ఉండగా నలుగురు సభ్యులు అవసరం అవుతారు. అయితే ఇం డిపెండెంట్లుగా 8 మంది గెలుపొందారు.

బీజేపీ శిబిరంలో ముగ్గురు ఇండిపెండెంట్లతో ఒక ఏఐఎఫ్ బి సభ్యుని భర్త క్యాం పులో ఉన్నారు. అనూహ్యంగా 27 డివిజన్ నుంచి ఏఐఎఫ్ బి నుంచి గెలుపొందిన తో ట శ్యామల ఆదివారం తన కారులో బయల్దేరుతూ తాను ఓటింగ్ రోజు వస్తానని, తన ఇష్టం ఉన్నవారికి ఓటేస్తానని ప్రకటించడంతో భర్త బీజేపీ క్యాంపులో ఉండగా, భా ర్యను కాంగ్రెస్ వారే తమవైపు తిప్పుకున్నారని ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఏఐఎఫ్ బి రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి కాంగ్రెస్ కు అనుకూలంగా విప్ జారీ చేశా రు. ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగడంతో ఏ పార్టీ మేయర్ పదవిని అధిష్టిస్తుందోనని నగరవాసుల్లో ఆసక్తి నెలకొంది. అయితే స్వతంత్రు లుగా గెలుపొందిన వారికి, ఇతర పార్టీల వారికి భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ఫోన్లు వస్తుండడం, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇద్దరు మంత్రులు రంగంలోకి దిగి ఈ వ్యవహారాలు నడిపిస్తుండడంతో బీజేపీకి మేయర్ ఎలాగైనా దక్కించుకోవాలన్నా వ్యూహంలో కేంద్ర మంత్రి ఉన్నారు.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ కు మేయర్, బీఆర్‌ఎస్ కు డిప్యూటీ మేయర్ పదవుల అంగీకారం కుదిరినట్లు తెలిసింది.జగిత్యాల మున్సిపల్ చైర్మ న్ సైతం ఆసక్తిగా మారింది. జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి లక్ష్మణ్ కుమార్‌తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. సంజయ్, జీవన్ రెడ్డిల మధ్య ఉన్న వర్గపోరును ఒక కొలిక్కి తెచ్చినట్లు తెలిసింది.

చైర్మన్ పీఠం ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి, వైస్ చైర్మన్ పీఠం జీవన్ రెడ్డి వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ జెండా మోసిన వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేసినట్లు తెలిసింది. కరీంనగర్ జి ల్లాలోని జమ్మికుంటలో స్వతంత్రులతో కలి సి బీఆర్‌ఎస్ నుంచి చైర్మన్ ను చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యూహం రచిస్తున్నారు. హుజూరాబాద్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించడంతో అక్కడ ప్రణవ్ సూచించినవారు చైర్మన్ కానున్నారు. చొప్పదండి ఎస్సీ మహిళా కావడంతో కాంగ్రెస్ నుండి ఎన్నికైన అభ్యర్ధి చైర్మన్ కానున్నారు.

పెద్దపల్లి జి ల్లా రామగుండంలో మక్కాన్ సింగ్ అనుచరునికి మేయర్ పదవి దక్కనుంది. మంథని లో మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి, సుల్తానాబాద్లో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అనుచరులకు చైర్మన్ పదవులు దక్కనున్నాయి. సిరిసిల్ల మున్సిపాలిటీలో మెజా ర్టీ స్థానాలు బీఆర్‌ఎస్ కు దక్కడంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం రోజు చైర్మన్, వైస్ చైర్మ న్ పేర్లను ప్రతిపాదించనున్నారు. ఇక్కడ కేటీఆర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. వేములవా డలో విప్ ఆది శ్రీనివాస్ నిర్ణయమే శిరోధా ర్యం కానుంది.

మెట్పల్లి మున్సిపాలిటీలో బీజేపీ చక్రం తిప్పే అవకాశం ఉంది. తొలుత ఆయా మున్సిపాలిటీల్లో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ప్రమాణ స్వీ కారం చేయించి అనంతరం మేయర్, డిప్యూ టీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నిక నిర్వహిస్తారు. ఆయా మున్సిపార్టీలోని స్థా నాల్లో సగానికి కంటే ఒక సభ్యుడు ఎక్కువ ఉంటే కోరంగా పరిగణించి ఎన్నిక నిర్వహిస్తారు. తక్కువ మంది ఉంటే ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు.