calender_icon.png 16 February, 2026 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడని ఉత్కంఠ!

16-02-2026 12:00:00 AM

కామారెడ్డి మున్సిపల్ పీఠంపై టెన్షన్..

కొన్ని చానళ్లలో బీఆర్‌ఎస్‌కు షాకిచ్చి కాంగ్రెస్‌లో నలుగురు కౌన్సిలర్‌లు చేరారని ప్రచారం

కాంగ్రెస్‌కే మున్సిపల్ పీఠం అంటూ వార్తలు ప్రసారం 

ఖండించిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌లు 

షబ్బీర్ అలీ నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం 

మరోవైపు బీజేపీ ప్రయత్నాలు 

చైర్మన్ పీఠం దక్కేది ఎవరికో..

కామారెడ్డి, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ నెలకొని ఉంది. కొన్ని వార్త ఛానల్ లో ఆదివారం ప్రసారమైన కథనాలను టిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్ లు ఖండించడమే కాకుండా కాంగ్రెస్లో చేరారు అంటూ పేర్కొన్న కౌన్సిలర్లతో వారు మాట్లాడించారు. టిఆర్‌ఎస్ లోనే ఉన్నామంటూ అధిష్టానం చెప్పిందే ఫైనల్ అంటూ వారు పేర్కొంటూ రికార్డును పంపించారు. 

షబ్బీర్‌ఇంట్లో ప్రత్యేక సమావేశం 

మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు నలుగురు కౌన్సిలర్ మద్దతు కావాల్సి ఉండడంతో ఎలా చేద్దామని షబ్బీర్ అలీ ఇంట్లో హైదరాబాదులో చర్చించారు. టిఆర్‌ఎస్ కు చెందిన నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటూ పుకార్లు రావడంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని భావించారు. అధిష్టానం చెప్పిందే ఫైనల్ అంటూ బిఆర్‌ఎస్ కౌన్సిలర్ పేర్కొనడం చూస్తుంటే కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ స్థానం పీఠముడి వీడనట్లే నని స్పష్టమవుతుంది.

సోమవారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ కు చెందిన 19 మంది కౌన్సిలర్లు గెలవడంతోపాటు ముగ్గురు ఇండిపెండెం ట్లు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ బలం 22 కాగా మరో నలుగురు కౌన్సిలర్ల మద్దతు లభిస్తే చైర్మన్ పీఠం కాంగ్రెస్ దక్కించుకునేందుకు సుగ్గమామ అవుతుంది. బిజెపి కి 16 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో టిఆర్‌ఎస్ లో గెలిచిన 11 మంది కౌన్సిలర్ల మద్దతు లభిస్తే బిజెపి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అవకాశం ఉంది.

టిఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అవుతుందా లేక కొందరు బిఆర్‌ఎస్ కౌన్సిలర్ లు ఓటింగ్ సమయంలో కాంగ్రెస్కు అవకాశం ఇస్తారా అనే చర్చ కొనసాగుతుంది. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్న బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఓటింగ్ సమయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదా అని చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలు ఛానల్లో నలుగురు బిఆర్‌ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్లో చేరారంటూ ఇక కాంగ్రెస్ కి మున్సిపల్ పీఠం అంటూ వార్తలు రావడంతో బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్ లు మాత్రం పాటి అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటామని పేర్కొన్నారు.

దీంతో కామారెడ్డి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కా, బిజెపి క అనే సందిగ్ధం నెలకొంది. బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గెలుపొందిన 16 మంది బిజెపి కౌన్సిలర్లతో నాందేడ్ లో మకాం వేసినట్లు తెలుస్తోంది. బిజెపి అధిష్టానం నిర్ణయం టిఆర్‌ఎస్ అధిష్టానం పెద్దలతో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. కామారెడ్డి మున్సిపల్ పీఠం కాంగ్రెస్క లేక బిజెపి కా అనేది తేలాల్సి ఉంది. 

షబ్బీర్ నివాసంలో చైర్పర్సన్ పీఠంపై చర్చ 

కాంగ్రెస్ చైర్ పర్సన్ స్థానాన్ని దక్కించుకునేందుకు డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి ఇన్చార్జి నేరెళ్ల శారద లు షబ్బీర్ ఆలీ నివాసంలో ఆదివారం చర్చించారు. చైర్ పర్సన్ స్థానం దక్కించుకోవాలనుకుంటే నలుగురు బిఆర్‌ఎస్ కౌన్సిలర్ ల మద్దతు అవసరం కావడంతో ఎవరు తీసుకొస్తే వారికి చైర్ పర్సన్ పదవి అప్పగిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. చైర్ పర్సన్ స్థానాన్ని ఆశిస్తున్న కొందరు  బిఆర్‌ఎస్ కు చెందిన కొందరు కౌన్సిలర్లను తమకు మద్దతు ఇవ్వాలని కోరడంతో కొందరు సుముకుత  వ్యక్తం చేశారని చెప్పడంతోనే  ఛానల్లో వార్తలు ప్రచారం అయ్యాయి అని తెలుస్తుంది.

నిజంగా చెప్పారా లేక కావాలని బురద చల్ల విధంగా వ్యవహరించారా లేక రాజకీయ ఎత్తుగడన అనేది తెలియాల్సి ఉంది. బిఆర్‌ఎస్ కౌన్సిలర్లు మాత్రం తాము  బీఆర్‌ఎస్ లోనే ఉన్నామని చెప్పారు. బిజెపి కౌన్సిలర్లు ఇంకా క్యాంపు లోనే ఉన్నారు. అధిష్టానం నిర్ణయం పై భారం వేసినట్లు తెలుస్తోంది. బిఆర్‌ఎస్ కౌన్సిలర్ లు కీలకంగా మారారు. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్కు, బిజెపికి టిఆర్‌ఎస్  కౌన్సిలర్ల మద్దతు తప్పనిసరి కావడంతో చైర్పర్సన్ పీఠముడి విడలేదు.