calender_icon.png 12 November, 2025 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త ప్రొడక్షన్ తొలిచిత్రం ప్రేమలు పెళ్లిళ్లు

12-10-2024 01:14:45 AM

టాలీవుడ్‌లో హెచ్‌ఎన్ క్యూబ్ ప్రొడక్షన్ అనే ఓ కొత్త సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ ప్రొడక్షన్ లోగో, మోషన్ పోస్టర్‌ను బిజినెస్ మ్యాన్ మహేశ్‌రెడ్డి లాంచ్ చేశారు. హిమనంద గజా సమర్పణలో రామ్‌నందా దర్శక, నిర్మాతగా ఈ సంస్థ వరుసగా ఐదు చిత్రాలు నిర్మించబోతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రామ్‌నందా మాట్లాడుతూ.. “సినిమాల మీద నాకు చాలా పట్టు ఉంది.

ప్రస్తుతం మా ప్రొడక్షన్ నుంచి ‘ప్రేమలు- పెళ్లిళ్లు’, ‘మనసు’, ‘ఎల్‌ఎస్‌ఎల్‌ఎమ్’, ‘గతి’, ‘రామున్ని నేనే- రావణున్ని నేనే’ చిత్రాలు రాబోతోన్నాయి. ఏడాది నుంచి నేను నా ఈ ఐదు సినిమాల కోసం పని చేస్తున్నాను. అన్ని చిత్రాల కథలు, స్క్రిప్ట్లులు రెడీగా ఉన్నాయి.

ఒక దాని తర్వాత ఒకటి చేస్తాను. ముందుగా ‘ప్రేమలు పెళ్లిళ్లు’ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొస్తాను. ఇందులో కొత్త వారినే తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పటికే సాంగ్స్ అన్నీ కంప్లీట్ చేశాం” అని తెలిపారు.