30 July, 2026 | 2:24 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్

06-06-2026 03:20 PM

నిర్మల్,(విజయక్రాంతి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక" లో భాగం గా 6 నుండి 12 వరకు వారం రోజులు "Enrolment Drive  (నమోదు కార్యక్రమం)"ను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విదార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో చేరి తమ బంగారు భవిషత్ కు బాటలు వేసుకోవాలని అన్నారు.

తమ కళాశాల లో అంకితభావం, అనుభవజ్ఞులైన అధ్యాపకులు బోధిస్తారని,  అధునాతనమైన కంప్యూటర్ లాబ్స్, సైన్స్ లాబ్స్, డిజిటల్  గ్రంథాలయం, నిర్మల్ జిల్లా లోనే అత్యంత విశాలమైన క్రీడా మైదానం మరియు NCC కల్గిన ఏకైక కళాశాల తమదని, ప్రభుత్వ ఉపకార వేతనాలు పొందే అవకాశం విద్యార్థులకు ఉందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని నిర్మల్ జిల్లా లోని విద్యార్థులందరూ వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు గంగాధర్, ఏ ఓ నాగ శ్రీనివాస్, దోస్త్ కోఆర్డినేటర్ కుంటా శ్రీహరి అధ్యాపకులు డాక్టర్ పి జి రెడ్డి, సూర్యసాగర్, డాక్టర్ శ్రీనివాస్, కట్టా రమేష్ రెడ్డి, డాక్టర్ హేమలత, సుభాష్, డాక్టర్ పవన్, డాక్టర్ రజిత తదితరులు పాల్గొన్నారు