calender_icon.png 12 November, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగ్గంలో ట్రైలర్ లాంచ్

12-10-2024 01:15:37 AM

సాయి రోనక్, ప్రజ్ఞ జంటగా నటించిన చిత్రం ‘లగ్గం’. రమేష్ చెప్పాల దర్శకత్వంలో సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణకు చిత్రబృందం  వినూత్న పద్ధతిని అనుసరించింది. ఇంజాపూర్‌లో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకలో వధూవరులతో ట్రైలర్‌ను లాంచ్ చేయించారు. తన కూతురికి గొప్ప సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని భర్తగా తీసుకురావాలని కలలు కనే ఓ తండ్రి ఆ తర్వాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడనేది ట్రైలర్‌లో చూపించారు. మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.