12 May, 2026 | 2:26 AM

నేటినుంచి తొలి విడత ప్రారంభం

12-05-2026 12:28 AM

జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు మొదలు

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండేళ్ల ఇంటర్మీడియట్ జనరల్, వొకేషనల్ కోర్సుల్లో ప్రవేశాల కో సం అడ్మిషన్ షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. 2026--27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు కా ర్యదర్శి అభిలాష అభినవ్ సోమవారం ప్రకటించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్, వెల్ఫేర్, మైనారిటీ, కేజీబీవీ, మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు ఈ షెడ్యూల్ ప్రకా రం నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి తొలివిడత అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.  విద్యార్థులు అవసరమైన సర్టిఫికెట్ల ను ముందుగానే సిద్దం చేసుకుని, నిర్ణీత గడువులోపు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసు కోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.