7,8,9 తేదీల్లో సీఐటీయూ మహాసభలు
సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ 2కే రన్
ముషీరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): డిసెంబర్ 7 8 9 తేదీల్లో మెదక్ పట్టణంలో జరుగు సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య పార్క్ నుండి 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ జెండా ఊపి 2 కే రన్ ను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను యజమాన్యాలకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్ లు తీసుకొచ్చిన సందర్భంలో సీఐటీయూ మహాసభలు జరుగుతున్నాయన్నారు. డిసెంబర్ 7వ తేదీన మెదక్ పట్టణంలో జరిగే భారీ కార్మిక బహిరంగ సభను తెలంగాణ రాష్ట్రంలోని అశేష కార్మిక వర్గం జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు పద్మశ్రీ ఎం. వెంకటేష్, శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎం. దశరథ్, జె. కుమారస్వామి, నగర కోశాధికారి కే. అజయ్ బాబు, నగర నాయకులు మల్లేష్ జి. నరేష్ శ్రీనివాస్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.




