ప్రైవేటు విద్యా వ్యవస్థను రద్దు చేయాలి
కుల వ్యవస్థను, మతతత్వాన్ని బలపరచాలనుకుంటున్న పాలకులు
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఏ. కోదండరాం
ముషీరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ స్కూలుగా మార్చాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమా ర్ అన్నారు. గురువారం కామన్ స్కూల్ విద్యా విధానం, శాస్త్రీయ విద్య అమలు, ప్రైవేట్ స్కూల్స్ రద్దు ఎజెండాగా సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర సదస్సు సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ సమాజంలో కొనసాగుతున్న అంతరాలను నిర్మూలించడంలో విద్య ప్రధాన భూమిక వహించాలని అన్నారు
అందుకుగాను అందరికీ సమానమైన, శాస్త్రీ య విద్య ఉచితంగా అందించాల్సిన అవసరం ఉందని టీపిటిఎఫ్ భావిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం ‘జాతీయ విద్యా విధానం-రాజ్యాంగ విలువలు‘ అనే అంశం పై ఏఐఎఫ్‌ఆర్ టీఈ అధ్యక్ష, వర్గ సభ్యులు ప్రొ. జి. హరగోపాల్ మాట్లాడుతూ విద్య ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ, కాశాయీకరణ ద్వారా తమ లక్ష్యాన్ని రాజకీయ ఎజెం డాను పాలకులు సాధించాలనుకుంటున్నారన్నారు.
గౌరవ అథితిగా ఎమ్మెల్సీ ప్రొ.ఎ. కోదండరాం మాట్లాడుతూ ఉపాధ్యాయునికి తరగతి గదే సమాజమని, ప్రభుత్వ విద్య సంక్షోభంలో ఉందని, ప్రభుత్వ విద్యను కాపాడడానికి ప్రగతిశీల సంఘాలన్నీ ఉపాధ్యాయ సంఘాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, ఏపిటిఎఫ్ పూర్వ అధ్యక్షులు నర్సింహా రెడ్డి, ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకులు పి. నాగిరెడ్డి, అకాడమిక్ సెల్ కన్వీనర్ ఎం. ప్రకాష్ రావు సందేశాలు ఇచ్చారు.
రాష్ట్ర కమిటీ సభ్యులు జి. తిరుపతిరెడ్డి, ఎం. రవీందర్, పి. నారాయణమ్మ, డి. శ్రీనివాస్, లక్ష్మ య్య యాదవ్, యం. కృష్ణారెడ్డి, రావుల రమేష్, ఏ. భుజంగ రావు, డి. రాజయ్య, బి. రాజు, యస్. విజయ్, భోగ రమేష్, అన్ని జిల్లాల నుండి పెద్దఎత్తున టీపీటీఎఫ్ సభ్యులు, విద్యాభిమానులు పాల్గొన్నారు.






