11 August, 2026 | 1:14 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

మెడికల్ కాలేజీల భవితవ్యం ప్రశ్నార్థకం

17-06-2025 01:15 AM

మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం రేవంత్ పాలనలో ప్రశ్నార్థకంగా మారిందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.

సోమవారం ఆయన ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, సీఎస్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు. తెలంగాణలోని ప్రభుత్వ 26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని, ఈనెల 18న హెల్త్ సెక్రటరీ, డీఎంఈ ఎన్‌ఎంసీ ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు.

ఇంత ముఖ్యమైన విషయంపై ఆలస్యంగా మేల్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం కమిటీ వేయడం హాస్యాస్పదమన్నారు. పరిపాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే మెడికల్ కళాశాలలకు కావాల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.