calender_icon.png 19 January, 2026 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ పీఠమే..లక్ష్యం

19-01-2026 01:49:57 AM

  1. తెలంగాణ ఎప్పటికైనా కాషాయమయం అవుతుంది

బూతు రాజకీయాలతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్..!

మా పార్టీ వైపు చూస్తున్న విద్యావంతులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

పార్టీలో చేరిన పలువురు వైద్యులు, ఫార్మా నిపుణులు

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యమని, ఇందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని బీజేపీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఎప్పటికైనా కాషా యమయం అవుతుందని, కర్ణాటకలోనూ బీజేపీ అధికారంలోకి రాబోతోం దని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజలకు విధానాలు చూపించలేక, బూతు మాటల రాజకీయాలతోనే కాలం గడుపుతున్నాయని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ప్రముఖ డాక్టర్ సాయిచంద్ర నాయకత్వంలో రాంచందర్‌రావు సమక్షంలో పలువురు డాక్టర్లు, ఫార్మా నిపుణులు బీజేపీలో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్‌రావు మాట్లాడుతూ.. విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని, రాజకీయాలకు విద్యావంతులు అవసరమన్నారు.

నాడు క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వారు రాజకీయాల్లో రావాలని చూసేవారని, నేడు అందుకు భిన్నంగా ఉందన్నారు. చదువుకున్న యువత రాజకీయాల వైపు ఆలోచిస్తున్నారని, బీజేపీ వైపు ఆకర్షితులు అవుతున్నారని, బీజేపీ దేశానికి అవసరమని గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జెన్ జీ నాయకత్వం ఉరకలు వేస్తోందని, దేశంలో రోజురో జుకూ దేశ వ్యతిరేక శక్తులు పెరుగుతున్నాయని, దేశ వ్యతిరేక శక్తులను ఎదురుకోవా లంటే మనం కూడా ఒక శక్తిగా ఎదగాలన్నా రు.

జాతీయవాదాన్ని బలంగా నిర్మించే శక్తులుగా తయారవ్వాలని, దేశ వ్యతిరేక శక్తులు జేఎన్‌యూ లాంటి విద్యాలయాల్లో మోదీ, అమిత్ షాపై విషం చిమ్ముతున్నాయని పేర్కొన్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో అఫ్జ ల్ గురును హీరోగా చిత్రీకరించడం, దేశ న్యాయస్థానాలను అవమానించడమేనన్నా రు. ఎంఐఎం కేవలం తెలంగాణకో లేదా హైదరాబాద్‌కో పరిమితం కాదని, కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు.

అయితే రాబో యే రోజుల్లో ఈ పరిస్థితి తప్పకుండా మారుతుందని, దేశం మొత్తం క్రమంగా కాషాయం వైపు సాగుతోందని, ఈ మార్పునకు నాంది పలకాల్సింది మేధావులేనని చెప్పారు. తెలం గాణ రాజకీయా ల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ‘మీ అందరిదే’నని ఆయన వెల్లడించారు. రాజకీయాల్లోకి రావడం అంటే అందరికీ టికెట్లు ఇవ్వడమే కాదని, దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యత, సామాజిక స్పృహ, రాజకీయ అవగాహన ఉంటే అటువంటి వారి భాగస్వా మ్యం దేశ నిర్మాణానికి తప్పకుండా ఉపయోగపడుతుం దన్నారు.

దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, భారత్‌ను ఒక జాతీయ శక్తిగా నిలబెట్టాలంటే మేధావులు బీజేపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని ఎవరైతే కాపాడుతారనే ఆలోచనను యువ త చేస్తోందని, అందుకే బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాయకులు శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, మాధవరం కాంతారావు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.