7 July, 2026 | 3:59 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

దయ్యం పోలే.. ప్రాణం పోయింది

26-08-2024 04:56 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 25: విజ్ఞానం ఎంత పెరిగినా ఎక్కడో ఒకచోట మూఢ నమ్మకాలు మనుషుల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఓ వ్యక్తికి దయ్యం వదిలిస్తామని చెప్పి తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. కూలీ పని చేసుకొని జీవనం సాగించే సామ్యూల్ మాసీ (30) అనే వ్యక్తి కొంతకాలంగా మూర్చ రోగంతో బాధపడుతున్నారు. దీంతో అతడికి దయ్యం పట్టిందని నమ్మిన అతడి కుటుంబం స్థానిక చర్చిలో పనిచేసే జాకోబ్ మాసీ అనే పాస్టర్‌ను సంప్రదించింది.

ఆయన గత బుధవారం సామ్యూల్ ఇంటికి వచ్చి దయ్యాన్ని వదిలించే నెపంతో తీవ్రంగా కొట్టారు. పాస్టర్‌తో ఉన్న మరో 8 మంది కూడా కొట్టడంతో సామ్యూల్ అక్కడికక్కడే మరణించాడు. దీంతో బాధిత కుటుంబం సామ్యూల్ మృతదేహాన్ని బుగురువారం ఖననం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు పాస్టర్ అతడి అనుచరులను శనివారం అరెస్టు చేశారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.