7 July, 2026 | 5:18 PM

అమెరికాలో ఏపీ డాక్టర్ కాల్చివేత

26-08-2024 04:54 AM

మృతుడు ప్రముఖ ఫిజీషియన్ రమేశ్ పెరంషెట్టి

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రపంచ గుర్తింపు పొందిన వైద్యుడు డాక్టర్ పెరంషెట్టి రమేశ్‌బాబు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాకు చెందిన రమేశ్.. అమెరికాలో అనేక దవాఖానలకు యజమాని. అలబామాలోని టస్కలూసా పట్టణంలో ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ ప్రాంతంలో ఎంతో ప్రజాదరణ పొందిన క్రిమ్సన్ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు రమేశ్ సహ వ్యవస్థాపకుడు. 

ఎంతో గొప్ప పేరు

టస్కలూసా కేంద్రంగా వైద్య సేవలు అందిస్తున్న రమేశ్‌కు ఈ రంగంలో 38 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నది. ప్రఖ్యాత ఫిజీషియన్‌గా ఎదిగారు. ఆయన సేవలకు గుర్తుగా టస్కలూసాలోని ఓ వీధికి రమేశ్ పేరు పెట్టారు. కొవిడ్ సమయంలో ఆయన అందించిన వైద్య సేవలకు గుర్తిస్తూ స్థానిక ప్రభుత్వంఅవార్డు ఇచ్చాయి.