7 July, 2026 | 2:55 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

30 గంటల పాటు నదిలో నిరసన

26-08-2024 04:57 AM

నాసిక్, ఆగస్టు 25: రైతుల సాగునీటి ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిర్నా ప్రాజెక్టుకు జలాలను మళ్లించే దిశగా చర్యలు తీసుకోవాలని శుక్రవారం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మెహూన్‌బరే గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బృందాల వారీగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ‘నార్ పార్ గిర్నా సంఘర్ష క్రితి సమితి’ ఆధ్వర్యంలో గిర్నా నదిలో 30 గంటల పాటు నిలబడి నిరసన చేపట్టారు. వీరికి మాజీ ఎంపీ, శివసేన (యూబీటీ) నేత ఉన్మేశ్ పాటిల్ మద్దతు పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ ప్రాంతం నుంచి ప్రవహించే నదుల జలాలను గిర్నాలోకి మళ్లించే ప్రక్రియను ప్రభుత్వాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గిర్నా ప్రాజెక్టు పరిధిలో 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, 55 ఏళ్లలో ప్రాజెక్ట్ కేవలం 11 సార్లు నిండిందని గుర్తుచేశారు. పంటలకు సాగునీరు అందకపోవడంతో దిగబడులు తగ్గుతున్నాయన్నారు. జలాల మళ్లింపునకు ఎన్నో చానెల్స్, కాల్వలు, సొరంగాలు నిర్మించాల్సి ఉందన్నారు. ప్రాజెక్ట్‌లోకి పుష్కలంగా జలాలు చేరితే లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.