calender_icon.png 6 December, 2024 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికను కిడ్నాప్ చేసి.. పెండ్లి చేసుకుని..

16-10-2024 01:07:36 AM

పొక్సో కేసు నమోదు.. నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష

ఎల్బీనగర్, అక్టోబర్ 15: బాలికను కిడ్నాప్ చేసి, ఆమెను పెండ్లాడిన నిందితుడికి కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికల్‌కు చెందిన మండే అనిల్ అనే యువకుడు బతుకుదెరువుకు హైదరాబాద్ వచ్చాడు.

యువకుడు వనస్థలిపురానికి చెంది న ఓ బాలికపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి పెండ్లి చేసుకున్నాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు 2019లో వనస్థలిపురం పోలీసులను ఆశ్రయిం చారు. అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 

ఎల్బీనగర్ పొక్సో కోర్టు(ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు) కేసును విచారించి నిందితుడు నేరానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చింది. నిందితుడికి పదేండ్ల జైలుశిక్షతోపాటు రూ.15 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.