10 May, 2026 | 7:18 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పై రైతులకు వీడియో కాన్ఫరెన్స్

17-03-2026 05:09 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పై రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... ప్రతి రైతు తన ఇంటి అవసరాల కోసం అయినా కచ్చితంగా సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార ధాన్యాలను కూరగాయలను వాడాలని రైతులకు సూచించారు.ఈ జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద రైతులకు కిట్లు అందజేయడం జరిగింది.ఈ కోట్లలో క్యాలెండర్ పెన్, టోపీ,జ్యూట్ బ్యాగు సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన సమాచారంతో కూడిన నోట్ బుక్కు రైతులకు అందించడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్ తెలిపారు.