10 May, 2026 | 6:09 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం చాలా కీలకం

17-03-2026 05:06 PM

పాపన్నపేట: దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం చాలా కీలకమని మై భారత్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర క్రీడా, యువజన మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా మై భారత్ పేరిట పలు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, క్రీడా కిట్లు అందజేస్తుంది.

ఈ నేపథ్యంలో మంగళవారం పాపన్నపేట మండలం తరుపున పాపన్నపేటకు చెందిన యువసేనా యూత్ అసోసియేషన్ ఎంపిక కాగా వారికి కిట్టు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలపై యువతలో ఆసక్తి పెంచేందుకు ఈ ఏడాది మెదక్ జిల్లాకు సంబంధించి 35 క్రీడా కిట్లు మంజూరు అయ్యాయన్నారు. సామాజిక సేవలు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసే సంఘాలకు తొలి ప్రాధాన్యం ఇస్తారని, మై భారత్ - ద్వారా క్రీడా కిట్లు పొందాలంటే 18-29 ఏళ్ల లోపు ఉన్న యువత అర్హులని పేర్కొన్నారు.