15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

ఆటల్లో ఆణిముత్యం అయిజ మండల అమ్మాయి

03-02-2026 02:13 AM

అయిజ ఫిబ్రవరి 2 జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలo మారుమూల గ్రామం చిన్నతాండ్రపాడులోని అతిపేద కుటుంబం ఎలిజిబెత్ సుధాకర్ ల మూడవ కూతురు సువర్ణ షూటింగ్ బాల్ క్రీడల్లో జాతీయస్థాయిలో సత్తా చాటుతుందని తల్లిదండ్రులు తెలియజేశారు. సౌత్ జోన్ సీనియర్ మహిళల షూటింగ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతులు గెలుచుకోవడమే గాక జాతీయస్థాయిలో కూడా కాంస్య పథకం గెలిచినట్టు కోచ్ గోపాలం తెలియజేశారని అన్నారు.

ఏప్రిల్ నెలలో జరగబోవు ఉత్తరప్రదేశ్ రా ష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో జరగబోవు క్రీడకు ఎంపికైనట్టు తెలియజేశారు. ప్రస్తుతం అమ్మాయి మహబూబ్నగర్ మహిళా డిగ్రీ కళాశాలలో BA రెండవ సంవత్సరం చదువుతున్నదని తెలియజేశారు. క్రీడల్లో రాణించి స్పోరట్స్ కోటాలో జాబు సంపాదించడమే తన లక్ష్యమని సువర్ణ అన్నారు. షూటింగ్ బాల్ క్రీడల్లో జాతీయ స్థాయికి ఎంపికైనందుకు కళాశాల ప్రిన్సిపాల్ జయప్రద ఫిజికల్ డైరెక్టర్ రజని గ్రామ సర్పంచ్ మహేశ్వరమ్మ సుధాకర్ గౌడ్ గ్రామస్తులు అభినందించారు.