రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, మార్చి 21 (విజయక్రాంతి): రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికి సెక్యులర్ పార్టీ ఆయన కాంగ్రె స్ పార్టీకి మైనార్టీలంతా అండగా నిలవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. రంజాన్ సం దర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేం ద్రంలో మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి.. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అం డగా నిలుస్తుందని అన్నారు.
పేద మైనార్టీలకు ప్రభు త్వం ద్వారా అందించే రుణాలు ఇప్పించడానికి తనవంతుగా సహకరిస్తానని తెలిపారు. ముస్లిం యువతకు ఉపాధి కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనభట్ల దినేష్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.




