22 March, 2026 | 1:23 AM

దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న మోదీ

22-03-2026 12:00 AM

ఎంపీ. డాక్టర్ కే. లక్ష్మణ్

ముషీరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యా ప్తంగా  క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కొత్తగా క్రీడా పాలసీని తీసుకువచ్చారని ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ పేర్కొన్నారు. బడ్జెట్లో క్రీడారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిం చడంతో పాటు మణిపూర్‌లో స్పోర్ట్స్ యూ నివర్సిటీ సైతం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ మేరకు శనివారం గాంధీనగర్ లోని ఘం టసాల క్రీడా మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ సంసద్ ఖేల్ మహోత్సవ్  మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ లో భాగంగా అక్షర స్ఫూర్తి ఫౌండేషన్, ఎంపీ  డాక్టర్ కే. లక్ష్మణ్ సంయు క్త ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్, షటిల్ టోర్నమెంట్ 2026 నిర్వహించారు.

ముఖ్యఅతిథి గా హాజరైన ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ గాంధీనగర్  డివిజన్ మాజీ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తో కలిసి క్రీడలను ప్రారంభించారు. విజేతలకు సర్టిఫికెట్లు, మెమొంటోలను వారు అందజేశారు. అనంతరం  ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ మాట్లాడుతూ  దేశవ్యాప్తం గా గ్రామస్థాయి నుంచి క్రీడాకారులను ప్రో త్సహిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రధాని మోడీ సంసద్ ఖేల్ మహోత్సవ పేరిట దేశవ్యాప్తంగా క్రీడలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భం గా క్రీడాకారులను డాక్టర్ కే. లక్ష్మణ్ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియ ర్ నాయకుడు కే. రాహుల్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూస రాజు, రాష్ట్ర నాయకులు పరిమళ కుమార్, జి. వెంకటేష్, బీజేపీ పార్ల మెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ కే. రవిచారి, గాంధీనగర్ డివిజన్ బీజే పీ అధ్యక్షుడు నవీన్ కుమార్, నాయకులు  బొల్లంపల్లి రామ్ రెడ్డి, రత్న సాయి చందు, శ్రీకాంత్, దామోదర్, ఉమేష్, నిత్యానంద్,  సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.