02-11-2025 12:40:35 AM
హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్
ములుగు, నవంబర్ 1 (విజయక్రాంతి): రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. ములుగు జిల్లాలో నిర్మించతలపెట్టిన 10+2 కోర్ట్ భవనానికి శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. పౌరిడి ప్రాథమిక హక్కుల పరిరక్షణే ధ్యేయం కావాలని వారు పేర్కొన్నారు. వ్యవస్థలోని అన్ని వర్గాల సహకారం,వనరుల లభ్యత న్యాయ వ్యవస్తకు ఉందని వారు తెలిపారు.
గట్టమ్మ దగ్గర కోర్టు భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ హై కోర్ట్ జస్టిస్ ఈ.వి.వేణుగోపాల్ జస్టిస్ ఎన్. రాజేశ్వర్‌రావు హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.వి. పి.సూర్య చంద్రకళా అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్‌లు హైకోర్ట్ న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పునాది రాయి వేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.