calender_icon.png 2 November, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో రైలు వేళల్లో మార్పులు

02-11-2025 12:42:31 AM

మొదటి మెట్రో రైలు ఉదయం 6 గంటలకు

అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి రాత్రి 11 గంటలకు చివరి రైలు

రేపటి నుంచి అమల్లోకి నూతన వేళలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల వేళలను సవరిస్తూ హైదరాబాద్ మెట్రో రైల్  కీలక ప్రకటన చేసింది. వారం లో అన్ని రోజులూ సోమవారం నుంచి ఆదివారం వరకు మొదటి మెట్రో రైలు ఉద యం 6 గంటలకు ప్రారంభం అవుతుంది. చివరి మెట్రో రైలు.. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరుతుం ది. ఈ మార్పులు నవంబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

ఇంతకుముందు.. సోమవారం నుంచి శుక్రవారం వరకు చివరి మెట్రో రైలు రాత్రి 11:45 గంటలకు ఉండేది. ఆదివారం రోజున మొదటి మెట్రో ఉద యం 7 గంటలకు ప్రారంభమయ్యేది. ప్రస్తు తం.. ఆదివారం రోజున ప్రయాణికులకు గంట ముందుగానే ఉదయం 6 గంటలకే సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే, వారపు రోజుల్లో సోమవారం--శుక్రవారం చివరి మెట్రో 45 నిమిషాల ముందుగా, అంటే రాత్రి 11 గంటలకే ముగియనుంది.

ఈ మార్పు ఆదివారాల్లో ఉద యాన్నే ప్రయాణాలు పెట్టుకునే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. అదే సమయంలో, వారపు రోజుల్లో రాత్రిపూట ఆఫీసులు, ఇతర పనులు ముగించుకుని చివరి మెట్రోలో ఇళ్లకు చేరే ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు కొంత ఇబ్బంది కలిగించేదిగా ఉన్నది.