02-11-2025 12:39:33 AM
అజారుద్దీన్ అనే నేను..
ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు సారథిగా అజారుద్దీన్ ఎన్నో రికార్డులు నమోదు చేశారు 2009లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అయినా.. ఆశ వదులుకోలేదు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు.
జెమీమా అదుర్స్
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇ న్నింగ్స్‌కు ఎప్పుడూ విలువ ఉం టుంది. మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఇలాంటి ఇన్నింగ్సే ఆడింది. అసలు అసాధ్య మనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషిం చింది. చివరి వరకూ క్రీజులో ఉండి 127 రన్స్‌తో అసాధారణ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించింది. తనపై విమర్శలకు ఆటతోనే సమాధానమిచ్చింది.