calender_icon.png 1 February, 2026 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యం

01-02-2026 01:39:41 AM

  1. కరీంనగర్ మేయర్, 3 చైర్మన్ పీఠాలు బీజేపీవే
  2. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, జనవరి 31 (విజయ క్రాంతి): కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంతోపాటు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను బీజేపీ విజయం కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వేల్లో వెల్లడైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిం చడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

శనివారం కరీంనగర్ లోని శుభం కన్వెన్షన్‌లో కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ ఇన్‌చార్జిలు, కన్వీనర్లు, కో కన్వీన ర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే టిక్కెట్ల విషయంలో అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ లో 80 శాతంపైగా టిక్కెట్లు వారికే ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొ న్నారు. గెలిచే అవకా శం లేని మిగిలిన స్థానా ల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆయా చోట్ల టిక్కెట్లు రాని బీజేపీ కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదన్నారు.

నామినేటెడ్ పోస్టులతోపాటు పార్టీ పదవులిచ్చి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులవల్లనేని స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి ఆగకూడదంటే బీజేపీకి ఓటేసి ఆశీర్వదించాలని కోరుతూ ఇంటింటికీ ప్రచారం చేయాలని కోరారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తానని చెప్పారు.కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి,  పార్టీ సీనియర్ నేతలు సాయిని మల్లేశం, గుజ్జ శ్రీను, ఇనుగొండ నాగేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.