నేడు హైదరాబాద్‌కు సీఎం
రేపు మంత్రులతో సీఎం భేటీ
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. రెండు వారాల పాటు స్విట్జర్లాండ్‌లోని దావోస్, అమెరికాలో పర్యటించిన సీఎం రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోర మ్ సదస్సులో తెలంగాణ ప్రతినిధి బృందం పెట్టుబడిదారులను ఆకర్షించింది. గూగుల్, యూనీలీవర్ వంటి దిగ్గజ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.
అమెరికా పర్యటనలో భాగ ంగా హార్వర్డ్ కెన్నడీ స్కూల్‌లో ‘21వ శతాబ్దపు నాయకత్వం’ అనే అంశంపై సీఎం కోర్సును పూర్తి చేశారు. హార్వర్డ్ కెన్ననడీ స్కూల్ నుంచి సర్టిఫికెట్ కూడా సీఎం అందు కున్నారు. సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు.
మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష
సీఎం రేవంత్‌రెడ్డి నగరానికి చేరుకున్న వెంటనే పాలన, రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. ఫిబ్రవరి 2న మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ర్టంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై సీఎం చర్చించనున్నా రు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార బాధ్యతలు, గెలుపు గుర్రాలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా ఎల్లుండి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఆయా జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచా రంలో పాల్గొనున్నారు.






