calender_icon.png 7 July, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉండాలి

07-07-2025 01:35:29 PM

  1. చదువు ఎప్పుడు వృధా కాదు.. నిరంతరం పోటీపడాలి 
  2. ఉద్యోగం రాకపోయినా నిరాశ పడకూడదు 
  3. ఉచిత కోచింగ్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ఉద్యోగం సాధించాలని తపన మీలో ఎల్లప్పుడూ ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి( Yennam Srinivas Reddy) అన్నారు. గత ఐదు నెలలుగా నిరుద్యోగ విద్యార్థులకు నిమిత్తం ఉచిత కోచింగ్ అందించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాలెడ్జ్ ని పెంచుకున్న తర్వాత పేస్ కి మీరు అర్హత సంపాదించుకుంటారన్నారు. మంచి కాలేజీలలో సీటు రావాలన్న రామా ఒకటే మార్గం షార్ట్ కట్స్ ఏ ఉండవు రికమండేషన్స్ ఏముండవని, మీరు రాసే ప్రతి పోటీ పరీక్ష కంప్యూటర్ దిద్దుతుందని,  ఇంతకు ముందు టీచర్లు పేపర్లు దిదే వారని ఇప్పుడు అట్లా లేదు మీ ఆన్సర్ షీట్ మొత్తం కూడా సిస్టం లో ఫీడ్ చేస్తే మీ ఆన్సర్స్ ను బట్టి మార్కులు కూడా వాళ్ళు అదే డిసైడ్ చేస్తా చేయడం జరుగుతుందన్నారు.  అంటే విద్య సమకూర్చుకోవాలంటే అలసత్వం ఉండకూడదని, నిద్ర వైపు చూడొద్దని వీటన్నిటిని దూరం పెడితేనే విద్య మనకు వస్తదన్నారు.

ఈరోజు నుంచి మీరు అదే సూత్రాన్ని నెత్తికెక్కించుకోవాలని,  కష్టపడి చదవండి అన్ని రకాల సౌకర్యాలు కూడా మీకు కల్పించడం మిగతా జిల్లాలో ఎవరికి కూడా ఇటువంటి సౌకర్యం లేదన్నారు. జూనియర్ కాలేజ్ లో ఎంసెట్ కోచింగ్ చూపిస్తే 114 మంది పిల్లలు ఫ్రీ సీట్లు తెచ్చుకున్నారని తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో కూడా మంచి ప్యాకేజీలతో వేతనం అందించడం జరుగుతుంది కేవలం ప్రభుత్వ ఉద్యోగం చేస్తేనే బతుకు కాదన్నారు. పట్టుదల స్వయంకృషి ఎల్లప్పుడూ వదలకూడదని సాధించాలనే తపన మీలో ఎప్పుడు ఉండాలన్నారు. యూట్యూబ్లో కూడా మంచి కోచింగ్ లో ఇవ్వడం జరుగుతుందని వాటన్నిటినీ చదివినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. అవసరమైతే మరో మారు ఉచిత కోచింగ్ అందించేందుకు తమ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ నేతలు గుండా మనోహర్, బెనహర్, డాక్టర్ రియాజ్ తదితరులు ఉన్నారు.