calender_icon.png 7 July, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 9 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

07-07-2025 02:50:55 PM

భారీ వర్షాలతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): రానున్న 3  రోజుల పాటు పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్  కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) సోమవారం ఒక ప్రకటనలో కోరారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా  మన జిల్లాలో జూలై 7 నుంచి జూలై 9 వరకు  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున  అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. నీటి వనరులలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జర్గకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.