07-07-2025 02:20:41 PM
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(Ramachandra Rao) విమర్శలు చేశారు. అక్బరుద్దీన్ ఒవైసీకి ఓ న్యాయం.. అట్టడుగు పేదలకు మరో న్యాయమా?.. అక్బరుద్దీన్ కాలేజీల్లో చదివే వాళ్ల జీవితాలే మీకు ముఖ్యమా?.. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల జీవితాలు మీకు పట్టవా?.. తక్షణమే అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్ కాలేజీ(Akbaruddin College Building) భవనాన్ని కూల్చివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. మీడియా సంస్థలపై బీఆర్ఎస్ పార్టీ దాడులు దుర్మార్గమని మండిపడ్డారు. మీడియా సంస్థలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.