07-07-2025 01:32:16 PM
మహాదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు(MRPS Foundation Day Celebrations) ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. జిల్లా ఇన్చార్జి రుద్రారపు రామచందర్ కేక్ కట్ చేసి మాట్లాడుతూ... మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ సాధించి సామాజిక ఉద్యమాలు ద్వారా సకల జనులకు మేలు చేశారని ఆరోగ్యశ్రీ పథకం వికలాంగులు వితంతువులు గుండె జబ్బు పిల్లల కోసం ఇలా సమాజానికి సేవ చేయడం సమాజంకు అండగా ఉండడం ద్వారా వర్గీకరణ సాధించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దండోరా ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సన్మానం చేయడం జరిగింది.
వివిధ గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు జెండా ఎగరవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ (Mahadevpur Block Congress Party) అభ్యర్థులు కోట రాజబాబు, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్బర్ ఖాన్, కాంగ్రెస్ యూత్ నాయకులు కటకం అశోక్, మైనార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ ఆశ్రర్ ఖురేషి, బిఆర్ఎస్ నాయకులు ఆన్కారి ప్రకాష్, బిఆర్ఎస్ యూత్ నాయకులు కూర తోట రాకేష్ , ముదిరాజ్ సంగం మండల అధ్యక్షులు గడ్డం స్వామి, రజక సంఘం జిల్లా నాయకులు చెన్నూరు వెంకటయ్య, నేతకాని నాయకులు ప్రేమా నందం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామారావు, మండల ఆర్ ఎం పి నాయకులు అబీబ్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.