calender_icon.png 7 July, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతల అభివృద్ధికి కృషి

07-07-2025 02:48:47 PM

బైంసా,(విజయక్రాంతి): రైతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్(Mudhol MLA Rama Rao Patel) అన్నారు. ముధోల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎన్ ఎఫ్ ఎస్ ఎం మినికిట్స్  కంది విత్తన పంపిణీని చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి కష్టం రానివ్వకుండా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు అందివ్వాలని కోరారు. బైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ , వ్యవసాయ శాఖ అధికారులు , వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.