17 June, 2026 | 8:43 PM

Breaking News

ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •  

జూబ్లీహిల్స్‌లో ది గుడ్ సైడ్

14-12-2025 12:00 AM

హైదరాబాద్‌లో తొలి లగ్జరీ మేకప్ స్టూడియో 

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్ బ్యూటీ, గ్రూమింగ్ రంగంలో ప్రత్యేకమైన కొత్త అడ్రస్‌గా ‘ది గుడ్ సైడ్’ జూబ్లీహిల్స్‌లో ప్రారంభమైంది. ఫిల్మ్ ప్రొడ్యూసర్ హన్షితారెడ్డి స్థాపించిన ఈ ప్రీమియమ్ లగ్జరీ మేకప్ స్టూడియో, సెలూన్‌ను సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ హారిక కో-ఫౌండ్ చేశారు. లాంచ్ కార్యక్రమానికి ప్రము ఖులు అల్లు స్నేహారెడ్డి, నిర్మాత దిల్ రాజు హాజరై స్టూడియోను ప్రారంభించారు.

ది గుడ్ సైడ్ ఫిలాసఫీ ప్రకారం, మేకప్ ద్వారా వ్యక్తిత్వంలోని సహజ లక్షణాలను మరింత అందంగా ఎలివేట్ చేయడం ముఖ్యమని హన్షితా చెబుతున్నారు. ప్రతి ఒక్కరిలో ఒక గుడ్ సైడ్ ఉంటుంది. దాన్ని ఇంటెన్షన్, డీటై ల్, ఆర్టిస్ట్రీతో హైలైట్ చేయడమే మా లక్ష్యం, అని ఆమె పేర్కొన్నారు. ఈ స్టూడియో ప్రత్యేకతగా మూడు ఇంటర్కనెక్టెడ్ బ్రైడల్, వీఐపీ సూట్లు నిలుస్తున్నాయి. పె

ళ్లికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలు లేదా ప్రైవేట్ ప్రిపరేషన్ సెషన్ల కోసం ఈ సూట్లు పూర్తి ప్రైవసీ, కంఫర్ట్ అందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ది గుడ్ సైడ్ సేవ ల్లో ప్రొఫెషనల్ మేకప్, హెయిర్‌స్టులింగ్, అడ్వాన్స్ హెయిర్కట్స్, కలరింగ్, లాషెస్, నైల్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, సిగ్నేచర్ స్పా రిట్యువల్స్ ఉన్నాయి.రాబోయే నెలలో హై డ్రా ఫేషియల్స్, మెడి-ఫేషియల్స్ను కూడా ప్రారంభించనున్నారు. అదనంగా, ప్రీ-బ్రైడల్, ఈవెంట్ ప్రెప్ కోసం కస్టమై జ్డ్ ప్యాకేజేస్ కూడా అందుబాటులో ఉన్నాయి.