calender_icon.png 14 December, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టెమ్ స్పార్క్ రెజొనెన్స్ విద్యార్థుల ప్రతిభ

14-12-2025 12:00:00 AM

జిల్లాస్థాయి బాలోత్సవ్‌లో బహుమతులు

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాల నీలో గల స్టెమ్ స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులు స్థానిక మంచికంటి భవన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి బాలోత్సవం 2025 పోటీలలో అద్భుత ప్రతిభ కనబర్చారు. డిసెంబర్ 10, 11, 12 తేదీలలో నిర్వ హించిన ఈ పోటీలలో డ్రాయింగ్, శాస్త్రీయ నృత్యం, ఫ్యాన్సి డ్రస్, స్పెల్‌ౠబి, వ్యాసరచన మొదలగు వివిధ అంశాలలో బహుమ తులు పొందారు.

స్పెల్‌రూబి పోటీలో 9వ తరగతి విద్యార్థి ఎన్ భువనచంద్ర, 8వ తరగతి విద్యార్థి డి.మణిదీప్ ద్వితీయ బహు మతి పొందారు. డ్రాయింగ్ పోటీలో ద్వితీ య బహుమతిని 5వ తరగతి విద్యార్థిని ఐ.సౌమ్యశ్రీ, ఫోక్ డాన్స్ విభాగంలో తృతీ య బహుమతిని కె.కార్తిక, బి.నూతన, ఎన్. నాన్సీ, జి.లక్ష్మీలౌక్య, కె.ఆరాధ్య, ఎన్. జోషిత, పి.జస్విత, జె. శ్రీ అన్విత, యమ్. శాన్వీ గెలుచుకున్నారు. రెజొనెన్స్ స్కూల్‌లో పాఠశాల డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు విద్యార్థులను అభినందించారు.

పాఠశాలలో శాస్త్రీయ, సాంప్రదాయ నృత్యాలకు ప్రత్యేకమైన శిక్షకులచే విద్యార్థుల అభిరుచి మేరకు తర్ఫీదు ఇస్తున్నామని తెలిపారు. పాఠశాల డైరెక్టర్ కొండా కృష్ణవేణి మాట్లాడుతూ.. ఎంతో మందితో పోటీబడి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి బహుమతులు పొందిన విద్యార్థుల ను అభినందించి, ఆశీర్వదించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.వి.ఆర్.మురళీమోహన్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.