12 July, 2026 | 6:07 PM

Breaking News

ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •  

పేదల కళ్లల్లో ఆనందం నింపడమే ప్రభుత్వ లక్ష్యం

01-04-2026 12:00 AM

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి 

చేగుంట, మార్చి 31, చేగుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు చెక్కులను అందజేసి, తాను మాట్లాడుతూ గతంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు పడే ఇబ్బందులను గమనించి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రభుత్వం కూడా దీనిని కొనసాగిస్తూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

నూతన సర్పంచ్ లు పారిశుద్ధంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ల ఇబ్బందులపై త్వరలోనే అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్,తహసీల్దార్ శివ ప్రసాద్ , నార్సింగి తాసిల్దార్ గ్రేసిభాయి ,ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంగల్ రావు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచ్ లు,ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.