కేరళ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారానికి మంగళవారం వెళ్లారు. రెండు రోజుల పాటు కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఏఐసీసీ స్టార్ క్యాంపెయినర్లను నియమించింది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రు లు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులను నియమించారు.
ట్యాంక్‌బండ్ శివకు 5 లక్షల సాయం
ట్యాంక్‌బండ్ శివకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయం అందించారు. కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయంతో పాటు అతని కుమారుడు వేణు మాధవ్ కు హోంగార్డు ఉద్యోగ నియామకపత్రం అందజేశారు. ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను శివ కాపాడారు.
ఉపాధిలేక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్న ట్యాంక్ బండ్ శివ పరిస్థితి తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, శివకు అవసరమైన సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ సమీపం లో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని సీఎంను శివ కోరడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, డబుల్ బెడ్రూం ఇల్లు మంజూ రు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.




