01-11-2025 08:45:19 PM
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..
మోతె (విజయక్రాంతి): ప్రతి పేదింటి బిడ్డను ఆదుకోవడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని కోదాడ శాసనసభ్యులు నల్లమాద పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మోతె మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11మందికి 11లక్షల 25వేల రూపాయల కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ యం వెంకన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, మాజీ జడ్పి టీసి పి.పుల్లారావు, కిసాన్ సెల్ కో ఆర్డినేటర్ ముది రెడ్డి మధు సుధన్ రెడ్డి, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రసిడెంట్ పులి ఈదయ్య, సోషల్ మీడియా మండల అధ్యక్షులు అర్వ పల్లి గణేష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.