3 April, 2026 | 3:16 AM

పారా క్వాట్ ప్రభుత్వం నిషేధించింది

03-04-2026 12:00 AM

కొమురవెల్లి, ఏప్రిల్ 2: కలుపు గడ్డి నివారణకు ఉపయోగించే పారా క్వాట్ అనే పిచికారి మందును ప్రభుత్వం నిషేధించిందని మండల వ్యవసాయ అధికారి కుందూరు వెంకట్ రావమ్మ అన్నారు. మండలంలోని రైతులకు అవగాహన కల్పిస్తూ, ఫర్టిలైజర్ దుకాణదారులకు పారాక్వాట్ నిల్వలో ఉన్న స్టాక్ కు దానిని ఉపయోగించకుండా, స్టాప్ సెల్ నోటీసులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారాక్వాట్ బదులుగా సురక్షితమైన, పర్యావరణహితమైన ప్రత్యామ్నాయలు ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. ఈ మందు ప్రభావంతో అనేక ఆరోగ్య సమస్యలు, ఊపిరితిత్తుల నష్టం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందన్న. రైతులు వీటిని దృష్టిలో పెట్టుకొని, పారాక్వాట్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరారు.